పెద్దమందడి, మే 11: అయ్యా సారు మీరు, మీ రా జ్యం ఉన్నప్పుడే బాగుండే అంటూ మాజీ మంత్రి సింగిరె డ్డి నిరంజన్‌రెడ్డి చూసి ఓ వృద్ధురాలి నోటినుంచి పలు ఆసక్తికరమైన మాటలు వచ్చాయి. పెద్దమందడి మండలంలో ని దొడగుంటపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న బీరప్ప పం డుగ సందర్భంగా యాదవుల ఆహ్వానం మేరకు పండుగ కు వచ్చిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పూజా కార్యక్రమం లో పాల్గొని మహిళలను పలకరిస్తుండగా ఆ పండుగకు వచ్చిన పామిరెడ్డిపల్లికి చెందిన మల్లమ్మ నిరంజన్‌రెడ్డిని చూసి మీరుండంగానే మాలాంటి వారికి, అందరికి ఎంతో బాగుండే..
అనడంతో ఆయన ఆ వృద్ధురాలిని అప్యాయతతో పలకరించి మాట్లాడాడు. మోసపోయి గోస పడుతున్నామని, మళ్లీ మీ రాజ్యమే రావాలని ఆ వృద్ధురాలు ఆనడంతో ఆ సన్నివేశాన్ని పలువురు తిలకించారు.