ఇటిక్యాల/ఎర్రవల్లి చౌరస్తా, జూలై 11 : బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. ఇటిక్యాల మండలం పెద్దదిన్నెలో కుర్వతిమ్మన్న, ఎర్రవల్లి మండలం ధర్మవరం, కోదండాపూర్, గార్లపాడు, తిమ్మాపూర్, వల్లూరు గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాందేవ్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ రంగారెడ్డి, నాయకులు శ్రీధర్‌రెడ్డి, రవిప్రకాశ్, యుగంధర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, సుందర్రాజు, సుధాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, లోకారెడ్డి, తిమ్మారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.