వక్ఫ్ బోర్డుకు సీఈవోను నియమిస్తారా.. ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈవోను నియమిస్తారా? ఆ ఉద్దేశం ఏమైనా ఉన్నదా? అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ను ఆదేశించింది.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈవోను నియమిస్తారా? ఆ ఉద్దేశం ఏమైనా ఉన్నదా? అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ను ఆదేశించింది. వక్ఫ్ బోర్డుకు సీఈవోను నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ సయ్యద్ ఇఫ్తికార్ హుస్సేనీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీ ఎం మొహియుద్దీన్ ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది.
వక్ఫ్ బోర్డు ఇన్చార్జి సీఈవోగా అసదుల్లా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదంటూ తీర్పు ఇవ్వడంతో దాన్ని సవాలు చేస్తూ ఇఫ్తికార్ హుస్సేనీ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీల్పై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. వక్ఫ్ బోర్డు సీఈవోగా ఉండే అధికారికి నిర్ధేశించిన అర్హతలు ప్రస్తుతం ఫుల్టైమ్ అదనపు చార్జితో కొనసాగుతున్న అధికారికి ఉన్నాయా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తిస్థాయి సీఈవోను నియమించే ఉద్దేశం ఉంటే ఆ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

