రాజోళి, నవంబర్ 9 : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల పై రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాటం చే స్తుందని, పచ్చని భూములను ఎడారులుగా మార్చే ఫ్యాక్టరీ అనుమతులపై అసెంబ్లీలో నిలదీస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం మండలంలోని పెద్ద ధ న్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీకి మద్దతుగా ఎమ్మెల్యే విజయుడు నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషపూరితమైన కంపెనీలకు అనుమతులు ఇచ్చి పచ్చటి పంట పొలాలను, ప్రజల ప్రాణాలను తీయాలని చూస్తే సహించేది లేదన్నారు. అనుమతులు రద్దు చేసే వర కు రైతులకు అండగా ఉంటామని తెలిపారు. నియోజకవర్గం పక్కనే తుంగభద్ర పారుతు న్నా పంటలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతు న్న సమయంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చొరవతో తుమ్మిళ్ల ఎత్తిపోతల, ఆర్డీఎస్ నీటివాటాలపై కృషి చేస్తూ రెండు పంటలు పండేలా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్కు ద క్కుతుందన్నారు.
ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చి రైతులను ముంచాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కం పెనీ వ్యర్థాలతో ప్రజల ప్రాణాలకు హాని, భూ ములు ఎడారులుగా మారుతాయన్నారు. ఇ థనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా లేఖను రాసినట్లు తెలిపారు. కంపెనీ యజమాన్యం ప్రజలకు తెలియకుండా పనులను ప్రారంభించాలని చూస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు పాల్గొన్నారు.