అలంపూర్ చౌరస్తా, నవంబర్ 23: నిరంతరం ప్రజల చెంతనే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం అలంపూర్ చౌరస్తాలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే సమస్యలను పరిష్కరించేలా చూస్తామన్నారు.
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం ప్రజలకు చేరేలా చూస్తానన్నారు. రాజోలి చెందిన సత్యనారాయణకు రూ.60వేలు, రామాపురం గ్రామానికి చెందిన తిరుమలేశ్కు రూ.26,500, రాజోలికి చెందిన దయాసాగర్ రూ.21వేలు ఇలా వడ్డేపల్లి, రాజోళి మండలాలకు చెం దిన 10మంది లబ్ధిదారులకు రూ.1.50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.