ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్ 16 : ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు తెలిపారు. మండలంలోని కొండేరు గ్రామంలో ఐకేపీ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే విజేయుడు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.2,320 తోపాటు రూ.500 బోనస్ మొత్తం కలిపి రూ.2,820రూ రైతులకు ఇవ్వనున్నట్లు వి వరాలు తెలిపే విధం గా చార్టును రూపొందించాలన్నారు.
ప్రోటోకాల్ ప్రకారం 9గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉండగా, 8:30గంటలకే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రాక ముందే మార్కెట్ కమిటీ డైరెక్టర్ రుక్మనందరెడ్డి, మం డలానికి చెందిన కాంగ్రెస్ నాయకులతో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఏపీఎం కుర్మయ్య ప్రోటోకాల్ ప్రకారం ఎ మ్మెల్యే వస్తున్నారని తెలుపగా ఏపీఎంతో వాదించి కాంగ్రెస్ నాయకులు ధాన్యం కొనుగోలు ప్రారంభించడం కొసమెరుపు. కార్య క్రమంలో అధికారులు పాల్గొన్నారు.