అలంపూర్, ఆగస్టు 22 : రైతులకు ఇచ్చిన హామీ లో భాగంగా రూ.2లక్షల రుణమాఫీ కచ్చితంగా అ ర్హులందరికీ ఇవ్వాల్సిందేనని, కొందరికి ఇచ్చి మరికొందరిని విస్మరించడం కాంగ్రెస్ చేతగాని తనానికి నిదర్శనమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అ న్నారు. గురువారం అలంపూర్‌లోని తాసీల్దార్ కా ర్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడా రు.
ఆరు గ్యారెంటీలంటూ కాంగ్రెస్ బోగస్ మాట లు చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చే యడం చేతగాక కుంటి సాకులు చెబుతున్నదన్నా రు. కనీసం 50శాతం రైతులకు కూడా మాఫీ కాలేదని, ఎంతో మంది అన్నదాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి నిబంధనలు లేకుండా అర్హులందరికీ రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లే దని తేల్చిచెప్పారు. అనంతరం తాసీల్దార్ మంజుల కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.