ఉండవెల్లి, అక్టోబర్ 2 : బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. కార్యకర్తలకు అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు భరోసా కల్పించారు. మండలంలోని మారమునగాల-1 గ్రామానికి చెందిన గొల్ల వెంకట్రాముడు నాలుగు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడికి బీఆర్ఎస్ పార్టీ రూ.2 లక్షల ప్రమాద బీమా ఉండటంతో కేటీఆర్ ఆదేశాల మేర కు బుధవారం చెక్కును మృతుడి భార్య లక్ష్మీదేవమ్మకు ఎ మ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీశ్రేణులకు ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటామన్నా రు. ఆయన వెంట ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి, మాజీ స ర్పంచ్ వీరన్నగౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అ నంతరం ఎమ్మెల్యే గ్రామంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని మహాత్ముడికి నివాళులర్పించారు.