అలంపూర్, అక్టోబర్ 9 : జోగుళాంబ ఆలయంలో బుధవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డితోపాటు ఎమ్మెల్యే పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, ఈవో పురేందర్, ఆలయ కమి టీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.