ఉండవెల్లి, ఆగస్టు 15 : దేశ విముక్తి కోసం ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు, వారి త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయుడు జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ వారు భారత దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడి సంపదను దోచుకున్నారు. వారి పాలనకు వ్యతిరేకంగా దేశంలో అనేక పోరాటాలు చేసి ఎంతో మంది దేశ నాయకులు ప్రాణాలను అర్పించారని వారిని ఎప్పుడూ మర్చిపోవద్దని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.