ఉండవెల్లి, అక్టోబర్ 10 : పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఎందరికో ఆపన్నహస్తం అందించారని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.
తన క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండవెల్లి, మానవపాడు, ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాలకు చెందిన 178 మందికి చెక్కులను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ గజేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.