అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 29 : అలంపూర్ నియోజవర్గ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే విజయుడు అన్నా రు. ఆదివారం బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, తాగు, సాగునీరు.. ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానన్నారు. నిరంతరం ప్రజల చెంతనే ఉంటూ వారి సమస్యలను తీరుస్తానని భరోసానిచ్చారు.
ప్రజలందరూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. వివిధ అనారోగ్య సమస్యలు, మృతుల కుటుంబాలకు, ఆపరేషర్ల కోసం సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీని ఎందరికో అందజేశామన్నారు. అనంతరం ఉండవల్లి మండలం బైరాపురానికి చెందిన హుస్సేన్ మియాకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.21 వేలు, అలాగే రాజోళి మండలం తుమ్మిళ్లకు చెందిన మద్దిలేటికి రూ.8 వేలను ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రంగారెడ్డి, అనంద్, రఘురెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు గజేందర్రెడ్డి, సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.