Ala venkateshwar reddy | ‘సర్’ కార్యక్రమంపై ప్రతి కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలి : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడ్డాకుల మండల పరిధిలోని శాఖపూర్, కందూరు, సుంకరోనిపల్లి గ్రామాల బూత్‌ల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Ala venkateshwar reddy | అడ్డాకుల, జులై 14 : అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడ్డాకుల మండల పరిధిలోని శాఖపూర్, కందూరు, సుంకరోనిపల్లి గ్రామాల బూత్‌ల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ప్రతి కార్యకర్త పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అలాగే గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రతి బూత్‌లో పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని సూచించారు.
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read ALso :
Anil Menon | ఈ రాత్రే అంతరిక్ష యాత్రకు అనిల్ మీనన్.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తిరిగి భూమికి
Watch: కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై రైల్వే వివరణ
Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచిన నైలా గ్రేవల్ !
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

