భూత్పూర్, నవంబర్ 1 : అనేక హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రహమత్‌నగర్ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి తరఫున మాగంటి సునీతకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటరును కలిసి కారుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి నేడు వాటిని నెరవేర్చలేక ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. పదేండ్ల పాలనకు, రెండేండ్ల పాలనకు బేరీజు వేసుకోవాలని కోరారు. మోసపూరిత మాటలు నమ్మి మరోసారి మోసపోకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, సత్తూర్ నారాయణగౌడ్, హర్షవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రయ్యసాగర్, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.