మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మూసాపేట, డిసెంబర్ 19 : గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయోత్సవాల సాక్షిగా దళిత యువతిని రైతువేదిక వద్దకు లా క్కెళ్లి లైంగికదాడి జరిపి.. ఆ తర్వాత మరణానికి కారణమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న వారిని కాపాడేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు లైంగికదాడి తర్వాత తీవ్ర రక్తస్రావమై మరణించిన సంఘటనపై పోలీసులు సరైన దర్యాప్తు జరపడం లేదంటూ.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి.
ఈ ఘటనపై చలించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బాధితులను పరామర్శించడానికి వెళ్లగా ఆ యన్ను పట్టుకొని గట్టిగా ‘అన్యాయం జరిగిపోయింది అన్నా’.. అంటూ బాధిత కుటుంబ సభ్యు లు రోధించడం కలిచి వేసింది. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం గ్రామానికి మృతదేహాన్ని తరలించగా న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరిపేది లేదంటూ బాధితురాలు తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు, దళిత సంఘాలు ఆందోళనకు దిగారు. చివరికి భూత్పూర్ సీఐ రామకృష్ణ దళిత సంఘాల నేతలు, గ్రామస్తులతో మాట్లాడి నిందితులందరినీ కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దళిత యువతి లైంగికదాడి, హత్య ఘటనపై మాజీ ఎమ్మెల్యే ఆ ల వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అధికారులతో మాట్లాడి నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలో దళిత యువతి రేప్, మర్డర్ ఘటన జరిగినా దళితులకు న్యాయం దక్కడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరు జిల్లాలో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా ఓ దళిత యువతి లైంగికదాడి, హత్య ఘటన జరిగిన ఎస్పీ ఘటనా స్థలానికి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని ఓ గ్రామంలో ఈనెల 17వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి రవిరాజాచారి సర్పంచ్‌గా గెలుపొందాడు. దీంతో కాంగ్రెస్ నాయకులంతా భారీ జులూస్ తీ శారు. డీజే పెట్టి తాగి డ్యాన్స్‌లు చేశారు. ఈ జులుసులో గ్రామానికి చెందిన దళిత యువతి (22) తల్లి కూడా ఉండడంతో బుధవారం రాత్రి 8 గం టల సమయంలో తీసుకురావడానికి వెళ్లింది. అ యితే అదే జులూస్‌లో ఉన్న సంగ విష్ణు.. యువతిని చూసి సమీపంలో ఉన్న రైతు వేదిక వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. తర్వాత 8:30 గంటల సమయంలో డీజే చప్పుడుకు యువతి స్పృహ తప్పి పడిపోయిందని సదరు యువకుడు జులూస్‌లో ఉన్న మరో మహిళకు విషయం తెలపగా.. ఆమె వచ్చి చూసింది.
అప్పటికే అపస్మారక స్థితి లో ఉండడంతోపాటు తీవ్ర రక్తస్రావం కాగా.. ఇ ద్దరూ కలిసి బైక్‌పై గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు యువతిని తీసుకెళ్లినట్లు తెలిసింది. తర్వాత మీ కూతురు ఆర్ఎంపీ క్లినిక్ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నదని యువతి తండ్రికి తెలియజేయడంతో భార్య, కొడుకుతో కలిసి ఆయన హుటాహుటిన అక్కడికి వెళ్లాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో ఏం జరిగిందని ప్ర శ్నించగా అక్కడే ఉన్న మహిళ, విష్ణు డీజే శబ్దానికి స్పృహ తప్పిందని నమ్మబలికారు. పరిస్థితి విషమించడంతో బిడ్డను రక్షించుకునేందుకు వెంటనే ఆటోలో జానంపేట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి సిబ్బంది పరిశీలించి పల్స్ పడిపోయిందని, వెంటనే మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే సమాచారం ఇవ్వగా వచ్చిన అంబులెన్స్‌లో యువతిని ఎక్కిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అదే రాత్రి 11 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల్లో గ్రామస్తులంతా పాల్గొని డ్యాన్సులు చేస్తున్న సమయంలో ఓ దళిత యువతిని అక్కడే ఉన్న విష్ణు రైతు వేదిక వద్దకు తీసుకువెళ్లడం.. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించి సామూహిక అత్యాచారానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో విష్ణును ఇప్పటికే పోలీసు లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించారు. అయితే దవాఖాన ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగా యి. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు రూ.30 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
దళిత యువతిపై లైంగికదాడి చేసి హత్య చేసిన సంఘటనపై మూసాపేట మండలంలోని గ్రామ ంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొన్నది. విష్ణు అనే యువకుడే ఈ చర్యకు పాల్పడ్డాడని, అతడితోపా టు మరికొందరు ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మిగతా వారిని వదిలేసి విష్ణుపై మా త్రమే కేసు నమోదు చేసి.. మిగతా వారిని కాపా డే ప్రయత్నం చేస్తున్నారని.. పోలీసులకు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. కాగా యువతి మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా.. అంబులెన్స్‌లో నుంచి కొద్దిసేపు మృతదేహాన్ని కిందకు దించకుండా దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితులను శిక్షించిన తర్వాతే అంత్యక్రియలు జరిపిస్తామని చెప్పడంతో భూత్పూర్ సీఐ రామకృష్ణ వారితో మాట్లాడి నచ్చజెప్పారు. విచారణ చేపట్టి నిందితులను పట్టుకొని శిక్ష పడేలా చూస్తామని చెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించారు.