అలంపూర్/ఉండవెల్లి/ఎర్రవల్లి చౌరస్తా, సెప్టెంబర్ 13 : రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కండ్ల ని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉండవెల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డు నూ తన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పుష్పమ్మ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బింగిదొడ్డి దొడ్డప్ప, వైస్‌చైర్మన్ పచర్లకుమార్తోపాటు 14మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కా ర్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మం త్రి జూపల్లితో కలిసి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములు బంగారు పంట లు పడించేందుకు అనువుగా ఉన్నాయన్నా రు. రైతులు లాభసాటి పంటలు పండించి అ ధిక దిగుబడితోపాటు అధిక లాభాలు ఆర్జించాలి, గద్వాల, అలంపూర్ రైతులు పండించిన పత్తి విత్తనాలకు దేశంలో మంచి డిమాం డ్ ఉందని గుర్తు చేశారు. అలంపూర్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాలంటే ఆర్డీఎస్తో పాటు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులు పూర్తి చేయడంతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొందా రు. ఇప్పటి వరకు 20 లక్షల మందికి రుణమాఫీ చేయడం జరిగిందని, రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్న వందశాతం రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. అదేవిధంగా పంటలు సా గు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.15 వేలు రైతు ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుదన్నారు. రైతులు సాగు చేసే ప్రతి పంటకు బీమా డబ్బులను ప్రభుత్వం చెల్లించడం తోపాటు ఒక ఎకరా పంట సాగుకు రూ. 1.50 లక్షలు వచ్చే విధంగా చూస్తామన్నారు.
ఆయిల్‌పాం తోటలు సాగు చేస్తున్న రైతుల సౌకర్యార్థం వచ్చే సంవత్సరం నాటికి బీచుపల్లి ఆయిల్ మిల్లును ప్రారంభిస్తామని చె ప్పారు. అదేవిధంగా అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల దవాఖానను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, అయిజ మండలంలో సబ్ మార్కెట్ యార్డును నూతన యార్డుగా చేసి కమిటీ నియమిస్తామని, 98 జీవో ద్వారా శ్రీశైలం ముం పు నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు దక్షిణకాశీగా పేరు గాంచిన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వా మి ఆలయాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలిసి దర్శించుకున్నారు.
అదేవిధంగా ఎర్రవల్లి మండలంలోని బీ చుపల్లి విజయ ఆయిల్ మిల్లోని ఆయిల్ పాం నర్సరీని మంత్రులు పరిశీలించి ఆయిల్‌పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సంతోష్‌తోపాటు వ్యవసాయాధికారులకు సూచించారు. కార్యక్రమంలో క లెక్టర్ సంతోష్‌కుమార్, ఎస్పీ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు కార్యదర్శి ఎల్లస్వామి, వ్య వసాయశాఖ ఏడీఏ సక్రియానాయక్, అధికారులు పాల్గొన్నారు.