మక్తల్, జూలై 13 : ఈ ఏడాది తొలకరి జల్లులు సకాలంలో కురువడంతో రైతులు మురిసిపోయారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మక్తల్ నియోజకవర్గంలో అధికంగా పత్తి, వరి పంటలు సాగు చేస్తుండగా, వరిసాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విత్తనాల ఎంపిక నుంచి నారుమడి దశ వరకు జాగ్రత్తలు తీసుకుంటే తెగుళ్ల బెడద, ఇతర సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.
మిట్ట నారు మడులకు కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బెన్డజిమ్ను తడి చేసి ఆరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి. అదే దమ్ము నారుమడుల కు లీటర్ నీటికి ఒక గ్రామ్ కార్బెన్డజిమ్ కలిపి 24గంటలు నానబెట్టి తర్వాత మండె కట్టిన మొలకలను నారమడిలో చల్లుకోవాలి.
నారుమడిని కలియదున్ని రెం డు, మూడుసార్లు దమ్ము చేసి చదును చేసిన తర్వాత నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాల్వలను ఏర్పాటు చేయాలి. ఎత్తు నారుమళ్లను తయారు చేసుకోవాలి. రెండు గుంటల (ఐదు సెంట్లు) నారుమడికి రెండు కిలోల నత్రజని, ఒక కిలో విత్తనం, మరో కిలో విత్తిన 12 నుంచి 14 రోజులకు ఒక కిలో భాస్వరం, ఒక కేజీ పొటాష్ దుక్కిలో వే సుకోవాలి. వీటితోపాటు పశువుల పేడను లేదా సేంద్రియ ఎరువులను దుకిలో వేయడం వల్ల నారుమడికి ఎంతో ఉపయోగం. మొలక కట్టిన విత్తనాన్ని మొదట్లో చల్లిన మొలకకు తడి ఆరేలా నీటిని మడిలో ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత మొకదశలో పలుచగా ఉన్న సమయంలో రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వ రకు నీటిని మడిలో ఉంచాలి. నారుమడికి జింకులోప సవరణ కోసం లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్పేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మెట్ట నారుమడిలో దాతు లోపాన్ని గమనిస్తే సరి చేసుకోవాలి.
నీటి వసతిని బట్టి చీడపీడలను తట్టుకునే విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన పొలం నుంచి సేకరించిన వడ్ల గింజలను వాడాలి. ఎంపిక చేసిన రకరకాల పరిమితిని బట్టి నిర్ణీత సమయంలో నారు వేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలను 140 రోజులకు జూన్ 20 వరకు, మధ్య స్వల్పకాలిక రకాలు 110 నుంచి 135 రోజులు జూలై 15వరకు, స్వల్పకాలిక రకాలు జూలై చివరి వరకు నారును పోసుకోవచ్చు. ఎకరా వరి సాగుకు సన్నరకం 20కిలోలు వాడాలి. దొడ్డు రకానికి 25కిలోలు వా డాలి. నాటే ముందు మొలక శాతాన్ని పరీక్షించుకొని నీరు పెట్టేందుకు, వదిలేయడానికి వీలుగా కాల్వలతో కూడిన ఎత్తైన నారుమడులు చేసుకోవాలి.
నారుమడి దున్నేటప్పుడు 20కిలోల పశువుల ఎరువు, ప్రతి రెండు గుంటలకు వేయాలి. మొలక కోసం ఉపయోగించే వరి విత్తనాలను కచ్చితంగా శుద్ధి చేసుకోవాలి. రెం డు గుంటల నారుమడిలో రెండు కిలోల నత్రజని, కిలో భాస్వ రం, కిలో పొటాష్ వేసి ఎరువులను విత్తేముందు సగం, విత్తిన 15 రోజులకు సగం వేయాలి. నారుమడి చుట్టూ గట్లపై చీడపీడలకు ఆశ్రయమిచ్చే తుంగ, గరక, ఊసలం వంటి కలుపు మొక లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్గి తెగులు, ఆకుముడుత తెగులు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారు తీయడానికి వారం ముందు రెండు గుంటల నారుమడికి ఇసుకలో కలిపి, నారుమడిలో చల్లుకొని పలుచగా నీటిని పెట్టుకోవాలి.