జడ్చర్ల/జడ్చర్లటౌన్, నవంబర్ 2 : సీఎం కేసీఆర్, నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్లలోని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలానగర్ మండలం చింతకుంటతండాకు చెందిన కాంగ్రెస్‌పార్టీకి చెందిన గ్రామాధ్యక్షుడు రవీందర్, వార్డు సభ్యులు రాజేశ్వరీ, శ్రీనివాస్, రమేశ్లతోపాటు వంద మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్ట్టీలో చేరారు. అదేవిధంగా నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నవాబ్‌పేట మండల కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు కమ్మరిశ్రీనివాసులు, కాకర్లపహాడ్ గ్రామాధ్యక్షుడు నర్సింహ, వార్డు సభ్యులు సత్యం, పాశం రమేశ్లతోపాటు 20మంది బీఆర్ఎస్లో చేరారు. నవాబ్‌పేట మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన చత్రూనాయక్, వెంకటేశ్, శ్రీను, నరేశ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయనే నమ్మకంతోనే వారంతా బీఆర్ఎస్ చేరడం జరుగుతుందన్నారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతుండడంతో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాలీ అవుతుంది.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. నవాబ్‌పేట మండలం మల్లారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గురువారం జడ్చర్లలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. అలాగే నిమ్మబావిగడ్డలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 120మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువాలు వేసి స్వాగతం పలికారు. పని చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి నవంబర్ 30న జరిగే ఎన్నికలో లక్ష మెజార్టీ సాధించే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
బాలానగర్, నవంబర్ 2 : మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన రాజేశ్ముదిరాజ్, రాకేశ్ ముదిరాజ్ గురువారం బీఆర్ఎస్ యూత్ వింగ్ మండలాధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ప్రకాశ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గెలుపుకోసం కృషి చేయాలని కోరారు.