అయిజ, జనవరి 28 : పల్లెలే దేశానికి పట్టుగొమ్మ లు.. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం రూ.40 లక్ష ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన కొత్తపల్లి, బైనపల్లి పంచాయతీ భవనాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పంచాయతీకి సొంత భవనం ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం సొంత భవనాలను మంజూరు చేసిందన్నారు. అయిజ మండలంలో 8 గ్రామ పంచాయతీలకు రూ.1.60 కోట్లు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు విడుదలైనట్లు వెల్లడించారు. వాటినన్నింటినీ పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ చల్లా మాట్లాడుతూ ఆర్డీఎస్ ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందించేందు కు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ విషయాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ ద్వారా లింక్ కెనాల్ ఏర్పాటు చేసి ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు సాగునీరు విడుదల చేసే లా చూస్తామన్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు పారేలా చర్యలు చేపడుతామన్నారు. కొత్తపల్లిలో సీసీ, బీటీ రోడ్లు వేయించేందుకు ఎ మ్మెల్యే సహకారంతో ప్రభుత్వంతో చర్చించి తగు చర్య లు తీసుకుంటామన్నారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వం ఏర్పడి కొద్దికాలమే అయ్యిందని, కొంత సమయమిచ్చి సమస్యలపై పోరాటం చేద్దామన్నారు. కార్యక్రమంలో సర్పంచులు సత్యమ్మ, సరస్వ తి, మున్సిపల్ చైర్మన్ దేవన్న, సింగిల్ విండో చైర్మన్ మ ధుసూదన్రెడ్డి, నాయకులు రంగారెడ్డి, రాముడు, నర్సింహారెడ్డి, త్రివిక్రమ్‌రెడ్డి, రవిరెడ్డి, ప్రహ్లాదరెడ్డి, భీమేశ్వర్రెడ్డి, చిన్న హన్మంతు, చాంద్‌పాషా, పల్లయ్య, గోవర్ధన్, కిశోర్, ముక్తర్‌పాషా, రామలింగన్న పాల్గొన్నారు.
వడ్డేపల్లి, జనవరి 28 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు ప్రగతి సాధించాయని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా అన్నారు. మండలంలోని నూ తన గ్రామ పంచాయతీ భవనాలను జిల్లెడదిన్నె సర్పం చ్ శారద, తిమ్మాజిపల్లె సర్పంచ్ మాధవితో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని, పాఠశాలలు, రోడ్లు, రైతువేదికలు, వైకుంఠధామాలు వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పారు. అ నంతరం వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ పీ రజితమ్మ, జెడ్పీటీసీ రాజు, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, ఉపసర్పంచ్ ఆంజనేయులు, నాయకులు శ్రీనివాసులు, సుదర్శన్, స్వాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, వినోద్‌బాబు, వెంకట్రామిరెడ్డి, ఈరన్న, కాశీం పాల్గొన్నారు.
అయిజ రూరల్, జనవరి 28 : మండలంలోని బింగిదొడ్డి గ్రామంలో నిర్మించిన పాఠశాల ప్రహరీని ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా ప్రారంభించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ప్రహరీ నిర్మించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, సింగిల్‌విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ రాముడు, విష్ణువర్ధన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, తిప్పన్న, రాజు పాల్గొన్నారు.