నాగర్కర్నూల్, మే 12: రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో 2024- 25 రబీకి వరి సేకరణ వరి ధాన్యం కొనుగోలుపై అధికారులతో కలెక్టర్ బదావత్ సంతోష్, శాసన మండలి సభ్యులు కూచకుళ్ల దామోదర్ రెడ్డి, శాసనసభ్యులు కూచకుళ్ళ రాజేశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణ రెడ్డి, ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారో అధికారులు అడిగి తెలుసుకున్నారు. పారదర్శక పాలన అందించేందుకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం రాగానే తూకం వేసి ధాన్యం విలువ తెలిసేలా, డబ్బుల విలువతో రసీదు కొనుగోలు కేంద్రంలోనే వారికి అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ధాన్యం సేకరణను ప్రతిష్టాత్మకంగా భా వి స్తూ, ఏ చిన్న పొరపాటు ఉండకుండా జా గ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూ చించారు.
ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300 చొప్పున కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు, సన్న రకానికి రాష్ట్ర ప్ర భుత్వం అదనంగా రూ. 500 చొప్పున బో నస్ అందించనుంది తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సన్న ధాన్యంలో దొడ్డు రకం వడ్లు కలువకుండా పకడ్బందీ చర్య లు చేపట్టాలని, వేర్వేరు కేంద్రాల ద్వారా వీటిని కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల వ్యవధిలో వారి ఖాతాలలో బిల్లులకు సంబంధించిన డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు. ఎవరైనా రైతును మోసగించేందుకు, నష్టపర్చేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించవద్దని, అవసరమైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ అందుబాటులో ఉండేలా చూడాలని, ముఖ్యంగా గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు సరిపడా సం ఖ్యలో సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్కు సూచించారు. జిల్లాలోని శాసన సభ్యులు తమ నియోజక వర్గంలో వరి ధాన్యం కొనుగోలులో తలెత్తుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రైస్ మిల్లు యజమానులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీఆర్డీవో చిన్న ఓబులేసు, పౌర సరఫరా శాఖ మేనేజర్ రాజేందర్,జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కల్వకుర్తి రూరల్, మే12: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృ ష్ణారావు అధికారులు, నియోజకవర్గస్థాయి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా ఇండ్ల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.