కొల్లాపూర్/నాగర్‌కర్నూల్, నవంబర్ 2 : రాష్ట్ర జీవి త బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెం ట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉ పాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్‌కర్నూల్ జి ల్లాలో చోటు చేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వివరాలను వెల్లడించారు. కొల్లాపూర్‌లో రిటైర్డ్ సబ్ పోస్ట్‌మాస్టర్ పుట్టపాగ సిద్ధన్న, ఉమాదేవి దంపతులు నివసిస్తున్నారు. ఉమాదేవి పట్టణంలోని బీసీ కాలనీలో ఉ న్న ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నది. ఆమె రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా సంస్థలో మూడు పాలసీలు చేసింది. పాలసీల మెచ్యూరిటీ గడువు ఈ ఏడాది ఆగస్టు 1న ముగిసింది. వీటికి సంబంధించిన జిరాక్స్‌లను కొల్లాపూర్‌లోని వరిదేల యూపీఎస్ లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఎమ్మార్సీ చం ద్రశేఖర్కు అందజేశారు. అతడి నుంచి ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డికి అందజేయాలి. వీటి కోసం రెండు, మూడ్రోజుల్లో కలవాలని ఉమాదేవికి ఎమ్మార్సీ సూచించారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన ఉమాదేవి భర్త సిద్ధన్న ఎమ్మార్సీని కలవగా.. లెటర్ టైప్ చేసి పాలసీ జిరాక్స్ ప్రతులను ఎంఈవోతో సంతకం చేయించాక అందిస్తే మహబూబ్‌నగర్‌కు పంపిస్తానని చంద్రశేఖర్ సూచించాడు.
తీరా ఎంఈవోను ఆయన కలిస్తే ఎమ్మా ర్సీ వద్దకే వెళ్లాలన్నాడు. ఇటీవల ఆయన్ను కలవగా.. డాక్యుమెంట్లు ఇచ్చేందుకు ఎంఈవోకు రూ.30 వేలు, ఆయనకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో చేసేది లేక ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. వా రి పథకం మేరకు.. బుధవారం మధ్యాహ్నం డబ్బులు అందించేందుకు ఎమ్మార్సీ చంద్రశేఖర్ పనిచేస్తున్న స్కూల్ వద్దకు సిద్ధన్న వెళ్లాడు. ఇద్దరికి కలిపి రూ.35 వేలు అందించి బయటకు రాగానే.. ఏసీబీ అధికారులు చంద్రశేఖర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వివరాల మేరకు నాగర్‌కర్నూల్‌లో ఉన్న ఎంఈవో చం ద్రశేఖర్రెడ్డిని నల్లగొండ ఏసీబీ సీఐ, అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించాక గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, నర్సింహతోపాటు 10 మంది సిబ్బంది పాల్గొన్నారు.
లంచం తీసుకున్నారన్న అభియోగంపై నాగర్‌కర్నూల్‌లోని ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి వద్ద సోదాలు చేసేందుకు నల్లగొండ ఏసీబీ బృందం వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉంచడడం, రాత్రి పొద్దుపోయే దాకా ఎవ రూ రాకపోవడంతో అధికారులు పడిగాపులు కాశారు. మధ్యరాత్రి అయినా ఇంటిని సోదా చేస్తామని ఏసీబీ బృందం సభ్యులు పేర్కొన్నారు.