Telangana | వైద్యం కోసం వెళ్లిన ఓ మహిళపై ఓ నర్సు దాష్టీకం ప్రదర్శించింది. ఇష్టమొచ్చినట్లు తిడుతూ చేయి కూడా చేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో మంగళవారం ఉదయం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.
మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. దామరగిద్ద మండలం కందేన్పల్లికి చెందిన నారమ్మ (32) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో సోమవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అయితే రాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఓ నర్సు నారమ్మపై దౌర్జన్యం ప్రదర్శించింది. ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టడమే కాకుండా చేయి కూడా చేసుకుంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని బాత్రూంలోకి వెళ్లింది. కానీ ఎంతసేపటికీ బయటకు రావడంతో బంధువులు తలుపులు బద్దలగొట్టి చూడగా ఉరేసుకుని నారమ్మ కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నర్సు దుర్భాషలాడుతూ చేయి చేసుకుందనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
నర్సు తిట్టిందని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ ఆత్మహత్య
వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి వచ్చిన నారమ్మ
మహిళా వార్డ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న నారమ్మ
రాత్రి నర్సు దుర్భాషలాడుతూ చేయి చేసుకుందని అందునే ఆత్మహత్యకు పాల్పడ్డదని బంధువుల ఆరోపణ pic.twitter.com/HhemoRbR7F
— Telugu Scribe (@TeluguScribe) January 21, 2025