నవాబ్‌పేట, ఫిబ్రవరి 18 : నవాబ్‌పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం వేరుశనగ క్వింటాకు రూ.7,189 ధర లభించింది. ఆదివారం మార్కెట్ యార్డుకు రైతులు వేరుశనగను విక్రయించేందుకు భారీగా తీసుకొచ్చారు. వివిధ గ్రామాల నుంచి 8,700 బస్తాల వేరుశనగ మార్కెట్‌కు వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి రమేశ్ తెలిపారు.
కాగా గ త వారం కంటే ఈ వారం క్వింటాకు అధికంగా రూ.200 ధర లభించినట్లు తెలిపారు. క్వింటాకు గ రిష్ఠంగా రూ.7,189 లభించినట్లు చెప్పారు. మార్కె ట్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టెండర్లు వేసినట్లు కార్యదర్శి వివరించారు.