Achampet | అచ్చంపేట రూరల్ : వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన అచ్చంపేట పట్టణంలో ఏంఏంఆర్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి ఆసుపత్రిలో వెళితే ఉప్పునుంతల మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శ్యామల బుధవారం సాయంత్రం కాన్పు కోసం ఏంఏంఆర్ ఆసుపత్రికి రాగా డాక్టర్ అర్చన, డాక్టర్ రామకృష్ణలు ఆపరేషన్ చేశారు. మగ శిశువుకు ఆమె జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ అనంతరం రక్తస్రావం ఎక్కువవడంతో ఆమెను హైదరాబాద్కు రెఫెర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు అచ్చంపేటకు మృత దేహాన్ని తెచ్చి ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. బాధిత కుటుంబాన్నీ ఆదుకొని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు.