మూసాపేట, సెప్టెంబర్ 21 : వోల్వో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, ఎనిమిది మంది గాయపడిన ఘటన అడ్డాకుల మ ండల కేంద్రంలో చోటుచేసుకున్నది. ఇందుకు సం బంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకా రం.. వోల్వో బస్సు శుక్రవారం రాత్రి బెంగుళూరు నుంచి 27మందితో హైదరాబాద్‌కు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున అడ్డాకుల పోలీస్‌స్టేషన్ సమీపంలోకి రాగానే ఆ సమయంలోనే జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ యూటర్న్ తీసుకొని తిరిగి హైదరాబాద్ వైపు వెళ్తుండగా బెంగళూర్ నుంచి వస్తున్న వోల్వో బస్సు ఢీ కొట్టి బోల్తాపడింది. అలాగే వోల్వో బస్సులో ప్ర యాణికులు ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
డ్రైవర్ వెంకటేశ్, కుమార్, శ్యాం కు మార్, కిరణ్‌కు తీ వ్ర గాయాలు కా గా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ఎల్అండ్టీ అంబులెన్స్‌లో జిల్లా దవాఖానకు తరలించారు. బస్సులో ఉన్న మిగతా వారిని పోలీసు లు వేరే బస్సులో హైదరాబాద్‌కు తరలించారు. రో డ్డుకు అడ్డంగా పడి ఉన్న బస్సును ఎల్అండ్టీ సి బ్బంది క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించి ట్రా ఫిక్‌ను క్లియర్ చేశారు.
వోల్వో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో జాతీయ రహదారి పక్కనే బహిర్భూమికి వెళ్లిన అడ్డాకులకు చెందిన ఆటోడ్రైవర్ కృష్ణయ్యపై వేగంగా బస్సు వచ్చి పడడంతో శరీరం మొత్తం ఛిద్రమై మాంసపు ముద్దగా మారింది. కాగా, మృతుడు కృష్ణయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.