దేవరకద్ర : దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి విద్యుదాఘాతంతో ( Electrocution) లారీ పాక్షికంగా దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి రాయిచూరుకు సిమెంటు లోడ్ ( Cement Load ) తో వెళుతున్న లారీ డ్రైవర్‌కు ఆకలి కావడంతో అంతరాష్ట్ర రహదారి రోడ్డు సమీపంలో లారీ ఆపి భోజనం చేసేందుకు కిందికి దిగాడు.
దీంతో లారీ నిలిపినచోట 11 కేవీ విద్యుత్ వైర్లు ఉన్న విషయాన్ని డ్రైవర్ గ్రహించకుండా వెళ్లడంతో లారీకి విద్యుత్ షాక్ తగిలి లారీ ఆరు టైర్లు ఏకకాలంలో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి విద్యుత్ అధికారులకు సమాచారం అందజేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. సకాలంలో అగ్నిమాపక వాహనం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.