Aditya Parasri Swami | ఊట్కూర్, ఏప్రిల్ 04 : గోవును రక్షించిన వారు సనాతన ధర్మాన్ని రక్షించిన వారవుతారని బిజ్వారం అంబత్రయ క్షేత్రం గురువు ఆదిత్య పరాశ్రీ స్వామి అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలోని బిజ్వారం అంబత్రయ క్షేత్రంలో ఇవాళ ఉదయం 9: 9 నిమిషాలకు మృగశిర నక్షత్ర యుక్త వృషభ లగ్న శుభ ముహూర్తంలో గో కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతుల సమక్షంలో హోమం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గో కళ్యాణం నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ.. గోపాదం పెట్టిన ఇల్లు శుభప్రదం అవుతుందని, ప్రతినిత్యం గోవును పూజించే వారికి దరిద్రం దూరమవుతుందని అన్నారు. ఆవు పాలతో జ్ఞానం, ఆత్మ చైతన్యం కలుగుతుందన్నారు.
ప్రతీ ఒక్కరూ దైవం వైపు చిత్తం పెట్టి భగవంతుడిని ధ్యానించాలని సూచించారు. లోక కళ్యాణం, పశు సంపద, పాడిపంటల సమృద్ధి కోసం గో కల్యాణ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో దాదాపు 5 వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్