‘సర్కార్ దవాఖానకు నేను రాను బిడ్డో’ అనే స్థాయి నుంచి ప్రభుత్వ దవాఖానకు రోగులు క్యూ కట్టే స్థాయికి మారింది. బీఆర్ఎస్ సర్కార్ కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలందిస్తుండడంతో రోగులు ప్రభుత్వ దవాఖాన వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక నడిగడ్డ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించంతో వైద్య, విద్య రంగంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది. వంద పడకలతో ఉన్న ఏరియాదవాఖానను జిల్లా ఆసుపత్రిగా మార్చడంతో అన్ని రకాల వైద్యసేవలు స్థానికంగానే అందుతున్నాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– గద్వాల, డిసెంబర్ 10
గద్వాల, డిసెంబర్ 10 : గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ ద్వాల ప్రాంతం అభివృద్ధిలో రాష్ట్రంలోనే వెనుకబడిపోయింది. వైద్యపరంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఏదైనా ప్రమాదం జరిగి గద్వాల దవాఖానకు వస్తే.. ప్రతి చిన్న దానికి కర్నూల్ లేదా హైదరాబాద్‌కు రెఫర్ చేసేవారు. వైద్యులు అందుబాటు లో ఉండకపోవడంతోపాటు మందులు అంతంత మాత్ర మే రోగులకు అందేవి. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పాటయ్యాక నడిగడ్డ రూపురేఖలు మారిపోయాయి. సీ ఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించంతో వైద్యరంగంలో అ భివృద్ధి వైపు అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం వంద పడకలతో ఉన్న ఏరియా దవాఖానను జిల్లా ఆసుపత్రిగా మా ర్చారు. దీంతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు స్థానికంగానే అందుతున్నాయి.
జిల్లా దవాఖానలో తెలంగాణ డయాగ్నోస్టిక్ పేరుతో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో 57 రకాలకు సంబంధించి ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా మందులు ఉచితంగా అందిస్తున్నారు. డయాలసిస్ రోగులు మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లకుండా దవాఖానలో పది బెడ్స్‌తో ఏర్పాటు చేసిన కేంద్రంలో డయాలిసిస్ చేస్తున్నారు. క్షతగాత్రులను వేరేప్రాంతాలకు రెఫర్ చేయడంతో అక్కడికి వెళ్లే లోపు ప్రాణాలు కోల్పోతున్నారన్న ఉద్దేశంతో జిల్లా దవాఖానలో 20 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశారు. రోగులకు అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు.
నర్సింగ్ కళాశాలకు శాశ్వత భవనం..
ఈ ప్రాంత విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేయాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నడిగడ్డ విద్యార్థుల కష్టాలు తీర్చేందుకు ప్రభు త్వం జోగుళాంబ గద్వాల జిల్లాకు నర్సింగ్ కళాశాల మంజూరు చేసింది. ఈ ఏడాది నుంచే ప్రైవేట్ భవనం లో కళాశాల ప్రారంభించారు. ఇప్పటికే ఆన్లైన్ అడ్మిష న్లు పూర్తై తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కళాశాలలో మొదటి ఏడాది 100 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. హాస్టల్ వసతి కూడా ఉన్నది. కళాశాల శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 40 కోట్లు మంజూరు చేసింది. కళాశాల ఏర్పాటుకు ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఐదెకరాల స్థలం చూ పించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చే తులమీదుగా భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అదనంగా 200 పడకలు..
ప్రస్తుతం జిల్లా దవాఖానలో వంద పడకలు ఉన్నాయి. దీనికి అదనంగా ప్రభుత్వం మరో 200 పడకలు మంజూరు చేసింది. ప్రస్తుతం దవాఖాన ఉన్న చోట స్థల ప్రభావం ఉన్నదున దౌదర్పల్లి దర్గా వద్ద ఉన్న 39 ఎకరాల్లోని ఐదెకరాలను నర్సింగ్ కళాశాలకు కేటాయించి, మిగతా 34 ఎకరాల్లో 300 పడకల దవాఖాన నిర్మించనున్నారు. ఇందుకుగానూ ప్రభుత్వం రూ.43 కోట్లు మంజూరు చేసింది. జిల్లా దవాఖానకు అదనంగా పడకలు మంజూరుకావడం, నర్సింగ్ కళాశాల ప్రారంభం కావడంతో నడిగడ్డకు మెడికల్ కళాశాల వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందనున్నది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ చొరవతో నడిగడ్డ వైద్యంతోపాటు విద్యవైపు అడుగులు వేసింది.
జిల్లా ఏర్పాటు తర్వాత మైనార్టీ, బీసీ, ట్రైబల్, సోషల్ వెల్ఫేర్‌తో కలిపి ఏడు గురుకులాలు మంజూరయ్యాయి మహిళా జూనియర్ కళాశాల నూతన బిల్డింగ్, పీజీ కళాశాల విద్యార్థులకు వసతి గృహాల నిర్మాణం చేపట్టింది. దీంతోపాటు గద్వాల పీజీ కళాశాలలో ఎంబీఏ కోర్సు ప్రారంభించారు. జిల్లా ఏర్పాటు తర్వాత నడిగడ్డ విద్య, వైద్యంలో దూసుకెళ్తున్నది.