మహబూబ్ నగర్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ ( Mahabubnagar ) జిల్లాలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ 83.04 శాతం ( Polling Percentate) నమోదు అయింది. గండీడ్ ( Gandeed ) , నవాబ్ పేట ( Nawabpet ) , మహమ్మదాబాద్, రాజాపూర్, మహబూబ్ నగర్ మండలాల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు.
ఐదు మండలాల్లో కలిపి మొత్తం 1,55,544 ఓట్లు ఉండగా 1,29,165 ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 83.04 శాతం పోలింగ్ నమోదు అయింది. మహబూబ్ నగర్ రూరల్ మండలంలో మొత్తం ఓటర్లు 33,918 మంది ఉండగా 29,407 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 86.70 శాతం నమోదు అయింది.గండీడ్ మండలంలో మొత్తం ఓటర్లు 31,295 మంది ఓటర్లుండగా 24217 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.38 శాతం నమోదు అయింది.
నవాబ్ పేట మండలంలో మొత్తం ఓటర్లు 38,535 మంది ఉండగా33,544 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87.05. శాతం నమోదు అయింది.రాజాపూర్ మండలంలో మొత్తం ఓటర్లు 20,925మంది ఉండగా 18,824 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 89.96 శాతం నమోదు అయింది.,ముహమ్మదా బాద్ మండలంలో మొత్తం ఓటర్లు 30,871 మంది ఉండగా, 23,173మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 75.06 శాతం నమోదు అయింది.