మహబూబ్‌నగర్, డిసెంబర్ 1 : కనీవిని ఎరుగని రీతిలో కారు జోరు కొనసాగుతుందని మహబూబ్‌నగర్ ని యోజకవర్గంలో తెగ చర్చలు జరుగుతున్నా యి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు తమ కారు జోరు కొనసాగాలంటూ ఓటర్ల చర్చలతో ప్రత్యేకతను చాటుకుంటుంది. టీ స్టాల్స్ నుంచి హోటల్స్, తదితర వ్యాపార సముదాయాల్లో అంత కారు జోరు ఉంటుందని సంభాషించుకుంటున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం విషయానికోస్తే సూర్యోధయం నుంచి సూర్యస్తమయం వరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రజలకు ఎ లా మంచి చేయాలి ? ఏమి చేస్తే మరింత మహబూబ్‌నగ ర్ ఉపందని అలోచనతో చేసిన అభివృద్ధిని ప్రజలు మన నం చేసుకుంటు చర్చించుకుంటున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో గతంలో కొంటే కొంత మేరకు ఓటింగ్ శాతం తగ్గిన గెలుపు మాత్రం కారు జోరు కనిపిస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయినప్పటికీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన పని తాను చేసుకుంటు ముందుకు సాగుతున్నాడు. నియోజకవర్గంలో ఎవరికీ ఆపద వచ్చిన ఆసుపత్రులకు చేరుకొని వారి ఆరో గ్యం మెరుగుపడేందుకు అవసరమైన వైద్య సదుపాయాలను వైద్యులు అందుబాటులో ఉంచాలని సూచనలు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 70.41 శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఈనెల 30న ఉద యం 7 నుంచి సాయంత్రం 5 గంటలలోగా బూత్ మా ర్కింగ్లోపల ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఈమేరకు పలు ప్రాంతాల్లో రాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 77.72 శాతం ఓట్ల నమోదు అయ్యాయి. పురుషులు 1, 25,808 మంది ఉండగా 89,537ఓట్లు, మహిళలు 1,2 6,498 మంది ఉండగా 88,883 ఓట్లు, ఇతరులు 12మం ది ఉండగా 9మంది, 37మంది ఎన్ఆర్ఐలు కూడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓట్లు 2,52,355మంది ఓటర్లు ఉండగా 1,78,429మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో మహబూబ్‌నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా 70.4 1 శాతం నమోదు కావడం జరిగింది.
మహబూబ్‌నగర్ నియోజకవర్గంతోపాటు జిల్లాలోని దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను పాలమూరు యూనివర్సిటీలో భద్రంగా ఉంచిన విషయం విధితమే. ఈ క్రమం లో ఈనెల 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియను చేసేందుకుగానూ జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నంమై పనిచేస్తుండ్రు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండ అధికారులు దగ్గర ఉండి అవసరమైన సూచనలు చేస్తున్నాడు.