Gadwal | గద్వాల అర్బన్, సెప్టెంబర్ 09 : సీఎంఆర్ వడ్ల వ్యవహారంలో మాత్రం రోజు రోజుకు ఒక్కో వ్యవహారం బయటపడటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కేటిదొడ్డి మండలం పరిధిలోని నందిన్నె గ్రామంలోని కిమిడిస్వామి రైస్ మిల్లు వ్యవహరం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఆ విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ అధికారులను నియమించి మూడు రోజులు పాటు రైస్ మిల్లులో విస్తృతంగా తనీఖి చేపట్టి మాయమైన వడ్ల విషయంలో నివేదికను తయారు చేసి రాష్ట్ర అధికారులకు పంపించగా… మాయమైన వడ్ల విషయంలో పూర్తి వివరాలు వెల్లడించాలని రైస్ మిల్లు నిర్వహకులకు నోటిసులు జారీ చేసిన్నట్లు తెలిసింది.
ఈ వ్యవహరంలో అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం మాయమైన వడ్ల విలువ దాదాపు రూ. 3 కోట్ల నుండి రూ. 6 కోట్లు ఉంటుందని సమాచారం. అందులో భాగంగా మిల్లు నిర్వాహకుడితో మాయమైన వడ్లను రికవరి లేదా.. అందుకు తగ్గట్టు డబ్బులు చెల్లింపులు చేసే అవకాశం ఉందని తెలిసింది. అనంతరం అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహరం గద్వాలలో చోటు చేసుకొగా… ఇలాంటి వ్యవహరమే అలంపూర్ పరిధిలోని ఓ రైస్ మిల్లులో కూడా విజిలెన్స్ అధికారులు గత వారం రోజులు క్రితం తనీఖీలు నిర్వహించగా వడ్ల లెక్కలో పెద్ద బొక్కలు ఉన్నట్లు అధికారులు ముందుగానే పసిగట్టిన్నట్లు తెలిసింది.
వాస్తవానికి అధికారులు ఆ మిల్లుకు 1,17,000 బ్యాగులు కేటాయించగా… మిల్లులో మాత్రం ప్రస్తుతం 75,000 బ్యాగులు ఉన్నట్లు అధికారుల లెక్కలో తేలినట్లు సమాచారం. కేటాయించిన ధాన్యంలో 42,000 బ్యాగులు మాయం అయిన్నట్లు గుర్తించిన్నట్లు తెలిసింది. ఈ వ్యవహరం బయటకు పొక్కకుండా మిల్లు నిర్వహకుడు తన పలుకుబడిని ఉపయోగించిన్నట్లు అలంపూర్ ప్రాంతంలో పుకార్లు షికారు చేస్తున్నాయి.తనీఖిలకు వచ్చిన అధికారులకు డబ్బుల కట్టలతో సరి చేసే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనీఖి చేసి వారమైన అసలు విషయం బయటకు రాకపోవడంపై అధికార యంత్రాంగంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మిల్లు నిర్వహకుడిపై ఎలాంటి చర్యలు తీసుకొకోవడంపై ఏంటని అలంపూర్ ప్రజలు చర్చించుకుంటున్నారు.
అయితే మిల్లులో మాయమైన 42,000 ధ్యానం బ్యాగుల విలువ దాదాపు రూ. 4 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచన వేసిన్నట్లు తెలిసింది. అలాగే జిల్లా కేంద్రంలోని మూడు రైస్ మిల్లులో కూడా ధాన్యం లెక్కలో తేడాలు ఉన్నట్లు గుర్తించిన్నట్లు తెలిసింది. సదరు మిల్లు నిర్వాహకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తమ మిల్లులో తనీఖి చేసిన విషయం బయటకు పొక్కకుండా చేశారన్న అరోపణలు జిల్లాలో గుప్పుమంటున్నాయి. ఈ విషయంపై జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయను వివారణ కోరగా… విజిలెన్స్ అధికారులు తనీఖి చేసిన నివేదికను నాకు పంపించ లేదని వివరించారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో ఆరా తీసి అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటాం. తప్పు ఎవరు చేసిన శిక్ష అనుభవించక తప్పదు. ఎవరికి మినహాయింపు ఉండదు. జిల్లాలో అన్ని మిల్లులపై మరోసారి తనీఖిలు చేపడుతామన్నారు.