మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 29 : రాష్ట్రంలో త్వరలో క్రీడా పాలసీని అమలు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖల మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహబూబ్‌నగర్ గ్రామర్స్కూల్లో చలో మైదాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ రాష్ర్టానికి రెండో స్థానంలో నిలిచిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలు ఆడేందుకు ప్రోత్సహించాలని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్దికి అన్ని విధాలా కృషి చేస్తున్నదని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు క్రీడా సామగ్రి పంపిణీ చేస్తున్నామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తేనే ప్రతిభ గల క్రీడాకారులు వెలుగులొకి వస్తారని, ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధిస్తారని గుర్తుచేశారు. క్రీడాకారులు మేజర్ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలన్నారు. అనంతరం వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, ఆర్చరి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాల య చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి,డీవైఎస్వో శ్రీనివాస్,గ్రామర్ స్కూల్ చైర్మన్ బెక్కరిరాంరెడ్డి, ప్రిన్సిపాల్ శాంత, కౌన్సిలర్ రష్మిక, నా యకులు ప్రశాంత్, మాల్యాద్రిరెడ్డి,శివరాజ్ పాల్గొన్నారు.
మంత్రి సుడిగాలి పర్యటన
మహబూబ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం పర్యటించారు. మహబూబ్‌నగర్ రూరల్ మండ లం పోతన్‌పల్లి గ్రామంలో రూ.70.04 లక్షలు, మాచన్పల్లిలో రూ.10కోట్లు, రాంచంద్రాపురంలో రూ.50లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో రైతులు మెరుగైన కరెంటు కావాలని అడిగితే కాల్పులు జరిపారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అడగక పోయిన 24 గంటల కరెంటు ఇస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు రైతులను దివాళా తీయించాయని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతును రాజును చేసిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని లేనిపోని హామీలు ఇస్తున్న బీజేపీ,కాంగ్రెస్ నాయకులు వారు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ స్థాయి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో ముందు స్పష్టం చేయాలని ఆయన ప్ర శ్నించారు. గతంలో ఉన్న రూ.200 పింఛన్‌ను తెలంగాణలో రూ.2,016 చేయడంతోపాటు అనేక పథకాలను అమలు చేసి అన్ని వర్గాలను ఆదుకుంటున్నట్లు చెప్పారు. ఐటీ పార్కులో లిథియం గిగా పరిశ్రమ, ఫుడ్పార్క్తో ఇక్కడి యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద జిల్లాలోని అన్ని చెరువులను నింపి సంవత్సరంలో రెండు పంటలను పండించేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అనంతరం మాచన్‌పల్లి గ్రామంలో రూ.1.61కోట్లతో నిర్మించిన 32 డబుల్‌బె డ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, వైస్‌ఎంపీపీ అనిత, రైతు బంధు మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి, రైతుబంధు డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, సింగిల్‌విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు అల్లావుద్దీన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, సర్పంచులు సత్యమ్మ, రాణెమ్మ, శ్రీకాంత్‌గౌడ్, మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.