మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 18 : అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామితో పాటు జిల్లా అధికార ప్రతినిధి గుడ్ల రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరేందర్, నాయకలు పవన్‌కుమార్, మహేశ్, సూర్యరాజు, కిరణ్, కృష్ణ, లక్ష్మి, వెంకటలక్ష్మి, వెంకటయ్య, సంజీవ్, లక్ష్మయ్య, గోపాల్, శివ, వెంకటలక్ష్మితోపాటు 100మంది మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న అభివృద్ధిని చూసి అధికార పార్టీలో చేరినట్లు తెలిపారు. అదేవిధంగా బండ్ల గేరికి చెందిన బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కుర్వ రమేశ్‌తోపాటు 50మంది, హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు 150మంది బీఆర్‌ఏస్‌లో చేరారు. మహబూబ్‌నగర్‌ను ఊహించని విధంగా అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు.
పాలమూరు, అక్టోబర్ 18 : బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు మంత్రికి శేషవస్త్రంతో ఆశీర్వదించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు వేణుగోపాల్, ప్రమోద్‌కుమార్, నాగరాజు, రాఘవేందర్, అర్చకుడు రాఘవేందర్శర్మ తదితరులు పాల్గొన్నారు.