వనపర్తి, ఫిబ్రవరి 22 : స్వరాష్ట్ర పాలనతోడి గడిచిన 9 ఏండ్లలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడు తూ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సమక్షంలో ఖిల్లాఘణపురం మండలం ఎమ్మార్పీఎస్ నాయకులు యా దగిరి, చెన్నయ్య, యాదయ్యతోపాటు 60 మంది నా యకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కార్యకర్తలే పట్టుగొమ్మలు..
పెబ్బేరు, ఫిబ్రవరి 22 : బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఏ కష్టమొచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటానని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి నాయకు లు, కార్యకర్తలే పట్టుగొమ్మలన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీలోని ఓ ఫంక్షన్హాల్లో చెలిమిల్లకు చెందిన 200 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. 5వ వార్డు కౌన్సిల్ గోపిబాబు ఆధ్వర్యంలో రాములు, కృష్ణ, మన్యం, స్వామితోపాటు భారీ సంఖ్యలో నేతలంతా కారెక్కారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతు న్న పథకాలపై ప్రతి కార్యకర్త ప్రచారం చేయాలని సూ చించారు. దేశవ్యాప్తంగా పథకాలను అందించేందుకే బీఆర్ఎస్ను సీఎం కేసీఆర్ స్థాపించారని చెప్పారు. కా ర్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వామి, ఎంపీపీ శైలజ, పట్టణ పార్టీ అధ్యక్షుడు దిలీప్‌కుమార్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రాములు, నా యకులు వెంకటేశ్, ఎల్లారెడ్డి, బుచ్చారెడ్డి, మహేశ్వర్రె డ్డి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతం చెలిమిల్లలో నాయకుడు మోహన్ భార్య మృతి చెందగా మంత్రి ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు.
మాధవ, మానవ సేవ చేయడం వరమే..
వనపర్తి రూరల్/గోపాల్పేట, ఫిబ్రవరి 22 : మా ధవ, మానవ సేవ చేసే భాగ్యం తనకు దక్కడం ఎన్నో జన్మల పుణ్యమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలంలోని మెంటపల్లిలో శివ కోదండరామ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠకు ఆలయ ధర్మక ర్త పురుషోత్తంరెడ్డితో కలిసి మంత్రి దంపతులు హాజరయ్యారు. అలాగే గోపాల్పేట మండలం పొల్కెపహాడ్ శ్రీ పాటిగడ్డ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలోని శివాలయంలో ధ్వజస్తంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెంటపల్లి గ్రా మానికి తాను ఎంతగానో రుణపడి ఉన్నానన్నారు. ఎంత ఎదిగినా భగవంతుడి సన్నిధానంలోకి వస్తే ఎలా ఒదిగి ఉంటామో, ఎదిగిన కొద్దీ సమాజ సేవ చేయడంలో కూడా ఒదిగి పోవాలన్నారు. ప్రభుత్వం మొదటగా వ్యవసాయానికి, అనంతరం గొర్రెలు, మేకలు, చేపల పెంపకానికి ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు. దేశంలోనే మాంస ఉత్పత్తిలో, మంచినీటి చేపల ఉత్పత్తిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైందన్నారు. గొల్ల కు రుమలకు గొర్రెలను పంపిణీ చేయడంతో లబ్ధి చేకూరిందన్నారు. అంతకుముందు పెద్దగూడెంలో పశువైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నట్టల నివారణ మం దు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆ యన సతీమణి వాసంతి పరిశీలించారు. బీఆర్ఎస్ నేత కృష్ణనాయక్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా మంత్రి పరామర్శించారు. కార్యక్రమాల్లో జెన్ కో రిటైర్ట్ ఎస్ఈ మంద తిరుపతిరెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ జిల్లెల రఘునాథ్‌రెడ్డి, పీఆర్డీఈ అశోక్, జెడ్పీటీసీ మంద భార్గవి, విండో వైస్ చైర్మన్ గువ్వల రాములు, సర్పంచులు వర్నె రజిని, శ్రీనివాసులు, ఎంపీటీసీ రత్నకుమారి, రైతుబంధు మండల అధ్యక్షుడు అడ్డాకుల తిరుపతి యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, మహిళా అధ్యక్షురాలు అనురాధ, ధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.