బుధవారం 02 డిసెంబర్ 2020
Mahabubnagar - Aug 07, 2020 , 04:31:04

శ్ర‌మైక్య... జీవ‌న‌.. సౌద‌ర్యం

శ్ర‌మైక్య... జీవ‌న‌..  సౌద‌ర్యం

వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో నేలమ్మ పులకించింది.  వారం రోజులుగా కమ్ముకుంటున్న కారుమబ్బులు వర్షిస్తుండ టంతో  ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఎక్కడ చూసినా పచ్చని పైర్లతో సస్యశ్యామలంగా దర్శనమి స్తున్నాయి. జూరాల నుంచి ఎత్తిపోతలకు నీటి పంపింగ్‌ కొనసాగుతుండటంతో నెట్టెంపాడు, భీమా, ఎంజీకేఎల్‌ఐ, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. ఇప్పటికే అందిన రైతుబంధు సాయంతో సాగు పనులు ముమ్మరంగా కొనసాతున్నాయి. పొలాల్లో ఆకుపచ్చని రంగులో వరి నారు కనువిందు చేస్తుండగా.. కరిగెట్లు సిద్ధం చేసే పనిలో అన్నదాతలు నిమగ్న మయ్యారు.  మరికొందరు పత్తి, కంది, జొన్న పంటల్లో కలుపుతీత, ఎరువులు చల్లే పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. 

- మహబూబ్‌నగర్‌ ప్రతినిధి/నమస్తే తెలంగాణ