మహబూబ్‌నగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తరలివెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. శుక్రవారం ఆయా నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలంపూర్ ఎమ్మెల్యేతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించారు.
ప్రతి నియోజకవర్గం నుంచి 3వేల మంది కార్యకర్తలను వరంగల్ సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు వాహనాలు, భోజనం ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయంగా మారిపోయాయి. సొంత వాహనాల్లో స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు కార్యకర్తలు సంసిద్ధమవుతున్నారు. శని, ఆదివారాల్లో అన్ని గ్రామాల్లో జెండా పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి జిల్లాలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 3వేల మంది కార్యకర్తల కోసం దాదాపు 300 వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో వాహనానికి ఇన్చార్జితోపాటు భోజన సౌకర్యం, తాగునీటి వసతి కల్పించి కార్యకర్తలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నేతలను ఇన్చార్జీలను నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చే వాహనాలన్నీ ఇటు శంషాబాద్, అటు పాల్మాకుల దాటాక ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకొని నేరుగా వరంగల్ హైవేలో దిగొచ్చు. కొన్ని నియోజకవర్గాల నాయకులు ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
సభకు తరలి వెళ్లేందుకు సిద్ధం చేస్తున్న ప్రతి వాహనానికి వాహన సంఖ్య, ఇన్చార్జి పేరు, సెల్‌నెంబర్‌తో స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్చార్జీలు లొకేషన్‌ను కూడా నియోజకవర్గ ఇన్చార్జీ కి షేర్ చేసి వాహనాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వె ళ్తున్నాయో పూర్తిస్థాయిలో మానిటరింగ్ చేసేందు కు పార్టీ నాయకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వెళ్లిన ప్రతి వాహనం తిరిగి గమ్యస్థానికి చేరే వరకు ఇన్చార్జీలు మానిటరింగ్ చేయనున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 13నియోజకవర్గాల నుంచి సుమారు 50వేల మందిని సమీకరించేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, నాయకుల సొంత వాహనాల్లో ప్రయాణించేందుకు సిద్ధం చేశారు. ఎంపిక చేసిన వాహనాలను ఆయా గ్రామాలకు పంపించి కార్యకర్తలను తరలించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
వనపర్తి టౌన్, ఏప్రిల్ 25 : ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. వనపర్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కలిసి ఆయన సభ స్థలానికి చేరుకొని బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడానికి రూట్ మ్యాప్‌ను మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. దేశ రాజకీయంలో వరంగల్ సభ చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి తరలివచ్చే బీఆర్ఎస్ శ్రేణులకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
కేసీఆర్ ఎన్నో చారిత్రాత్మక సభ లు నిర్వహించారని, ఈ సభతో తన రికార్డును తా నే మరోసారి రుజువు చేసుకోబోతున్నారన్నారు. 10లక్షల మందికి తగ్గకుండా ఉండే ఈ సభకు ఎన్నో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు మాణిక్యం, కృష్ణ య్య, లక్ష్మారెడ్డి, రఘుపతిరెడ్డి, సురేశ్‌రెడ్డి, విజయ్‌కుమార్, స్వామి, చౌమ్యనాయక్, శశివర్దన్‌రెడ్డి, కుమార్‌యాదవ్, ఎల్లారెడ్డి, రమేశ్ ఉన్నారు.
కల్వకుర్తి, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో ఉప్పల చారిట బుల్ ట్రస్ట్ చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ కలిశారు. వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనసమీకరణ ఏ ర్పాట్లపై కేటీఆర్ సూచనలు చేసినట్లు తెలిపా రు. కలిసిన వారిలో డీసీసీబీ డైరెక్టర్ వెంక టేశ్ గుప్తా, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్, వెంకట్‌రెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షుడు గణేశ్, బుచ్చిబాబు, వంశీ ఉన్నారు.
రజతోత్సవ సభకు తరలివచ్చే ఉమ్మడి జిల్లా కార్యకర్తలు, నాయకులకు జోన్-2లో వా హనాలు పార్కింగ్ చేసుకోవచ్చు. వరంగల్ జాతీయ రహదారిలో టోల్గేట్ దాటాక కరుణాపురం వద్ద జాతీయ రహదారి-163 బైపాస్‌లో దేవన్నపేట్, మేడిపల్లి, అనంత సాగర్ నుంచి పార్కింగ్ ఏరియాకు వెళ్లవచ్చు. అన్ని వాహనాలను అక్కడే పార్కింగ్ చేసి సమీపంలో ఉన్న సభా వేదిక వద్దకు నేరుగా చేరుకోవచ్చని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.