మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 17 : రాష్ట్రంలో జ రుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై గులాబీ గూటికి వలసలు వస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ఓబ్లాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు సుదర్శన్, జగదీశ్, కృష్ణమోహన్, నరేశ్, ఎల్లస్వామి, చంద్రశేఖర్, అశోక్, నిరంజన్‌తోపాటు 30 మంది.., నర్సాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నేతలు సత్తయ్య, అంజయ్య, శివ, నర్సింహులు, కాంగ్రెస్ నేత లు యాదయ్య, ఆంజనేయులు, శివకుమార్‌తోపాటు 35 మంది సోమవారం సర్పంచులు చంద్రకళ, వెంకటస్వామి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కా ర్యాలయంలో బీఆర్ఎస్ హన్వాడ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, నేత రమణారెడ్డి ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు సత్యనారాయణ, ఆంజనేయులు, రాఘవేందర్, శ్రీశైలం, అనిల్, రమేశ్తోపా టు 50 మంది గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పాలమూ రు బ్రహ్మంగారి మఠం కమ్యూనిటీహాల్లో హన్వాడ మాజీ ఎంపీపీ, గొండ్యాల ఎంపీటీసీ శేఖరాచారి ఆధ్వర్యంలో లింగనపల్లి బీజేపీ అధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు సత్తయ్యచారి, రాఘవాచారి, బాలుచారి, రమేశ్‌చారి, శ్రీనివాసాచారితోపాటు 50 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అధికార పార్టీలో చేరారు.
చౌడేశ్వరి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పణ
జిల్లా కేంద్రంలోని వీరన్నపేట చౌడేశ్వరి మాత జ యంతి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువ స్ర్తాలు సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, తొగుట వీర క్షత్రియ సేవా సంఘం నాయకులు చంద్రమౌళి, కురుమూర్తి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, బాలరాజు, నాగరాజు, భాస్కర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరో చోట షాదీఖానా నిర్మాణం..
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 17 : వక్ఫ్ రహెమాని యా ఈద్గా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో షాదీఖానాను నిర్మిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావించామని, కానీ కొందరు వద్దని చెప్పడంతో మరో చోట షాదీఖానా నిర్మిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మైనార్టీ నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. షాదీఖానా విషయంలో అనవసరపు వివాదా లు చేయొద్దని కోరారు. మరోచోట నిర్మించనున్న షాదీఖానాలో ఇమామ్, మౌజన్, మైనార్టీ యువతులు వివాహాలను ఉచితంగా చేసుకోవచ్చన్నారు. దీనిపై ఇక చ ర్చకు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.గతంలో హజ్‌హౌస్‌ను షాషాబ్‌గుట్ట, అవంతి హోటల్ సమీపంలో నిర్మిస్తుంటే వద్దన్నారని.. ఇప్పుడు జేజేఆర్గార్డెన్ వెనుక వై పు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే మొ ట్టమొదటిసారిగా పాలమూరులో హజ్‌హౌస్ నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలో ఆరు మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల ద్వారా మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. దర్గాలను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నా రు. కబ్రస్తాన్ కోసం ఎకరా అడిగితే 16 ఎకరాలు అం దించి అంతిమ సంస్కరాలకు ఇబ్బంది లేకుండా చూశామన్నారు. షాదీముబారక్ ద్వారా పేదలకు అండగా నిలిచామన్నారు. ఇమామ్, మౌజన్లకు రూ.5వేల గౌరవవేతనం అందిస్తున్నామన్నారు. జామియా మసీదు వద్ద అదనపు గదుల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూ రు చేశామన్నారు. కులమతాలకతీతంగా జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో మా ర్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యుడు అన్వర్‌పాషా, మైనార్టీ నాయకులు మో సీన్ఖాన్, వాజీద్, కలీం, సల్మాన్, హరున్ పాల్గొన్నారు.