నారాయణపేట, అక్టోబర్ 19 : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు, మద్యం, ఇత ర విలువైన వస్తువులు తీసుకెళ్తే చర్యలు తీ సుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతం హెచ్చరించారు. గురువారం ఎస్పీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జి ల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేసి రూ.15,39,700 పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. నారాయణపేటలో రూ.1,62,800, రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ.60 వేలు, దామరగిద్దలో రూ.80 వేలు, మద్దూర్‌లో రూ.55 వేలు, మాగనూర్‌లో రూ.90 వేలు, మక్తల్‌లో రూ.5.20 లక్షలు, ఊట్కూర్ పరిధిలో రూ.2,42, 500, కోస్గిలో 1.21 లక్షలు, ధన్వాడలో 2,08,400 పట్టుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే తగిన ప త్రాలు, రసీదు ఉండాలన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్‌కు సంబంధించి విద్యార్థులు, ఔత్సాహిక యువతకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. షార్ట్‌ఫిల్మ్ 3 నిమిషాల నిడివి ఉండాలన్నారు. అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో సేవ, ఇతర సందర్భాలలో కీర్తి ప్రతిష్టలు పెంపొందించే అంశాలు ఉండాలన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు తీసిన 3 ఫొటోలు, షార్ట్‌ఫిల్మ్‌ను పూర్తి వివరాలతో పెన్‌డ్రైవ్‌లో అప్లోడ్ చేసి ఈనెల 25లోగా ఎస్పీ కార్యాలయంలో అందజేయాలన్నారు.
కోస్గి/మాగనూరు/ఊట్కూరు, అక్టోబర్ 19 : కోస్గి మండలంలో వాహన తనిఖీలు నిర్వహించగా రూ.1.21 లక్షలను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీ నివాసులు తెలిపారు. రాయిచూర్ నుంచి దేవరకద్ర వైపు వెళ్తున్న వాహనంలో రూ.90 వేలు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు మాగనూర్ ఎస్సై మల్లేశ్ చెప్పారు. మాగనూర్ మండలం వర్కూ ర్ గ్రామానికి చెందిన ఊరిముందరి బాలప్ప నారాయణపేటకు కారులో రూ.58,500 తీసుకెళ్తుండగా ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశామని ఎస్సై గోకారి పేర్కొన్నారు.
జడ్చర్లటౌన్, అక్టోబర్ 19 : జడ్చర్ల పట్టణంలోని 44వ జాతీయరహదారి ఫ్లైఓవర్ వద్ద కారులో తరలిస్తున్న రూ.3.75 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. గురువారం పోలీసులు తనీఖీలు చేస్తుండగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద నగదు గుర్తించి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. నగదును విచారణ నిమిత్తం కలెక్టరేట్ ప్రత్యేక సెల్‌కు పంపించినట్లు జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు తెలిపారు.