గద్వాల, జూలై 5 : జూరాలకు శనివారం వరద ఉధృతి పెరిగిం ది. దీంతో 14గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని వి డుదల చేస్తున్నా రు. జూరాల పూ ర్తి స్థాయి నీటిమట్టం 9.657టీఎంసీలు కా గా, ప్రస్తుతం ప్రాజెక్టులో 7.444టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. జూరాల ప్రాజెక్టు నుంచి లిఫ్ట్‌లకు, కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,20,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 14గేట్లు ఎత్తి దిగువకు 92, 890 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 28,581, భీమా లిఫ్ట్-1కు 1,300, కోయిల్‌సాగర్‌కు 315, జూరాల ప్రధాన ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 290, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, భీమా లిఫ్ట్-2కు 750, సమాంతర కాల్వకు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,20,000, అవుట్ ఫ్లో 1,24, 710 క్యూసెక్కులుగా నమోదైంది.
శ్రీశైలం, జూలై 5 : శ్రీశైలానికి రోజురోజుకు వరద పెరుగుతున్నది. శనివారం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తికి 28,581 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 92,890, సుంకేసుల నుంచి 1,30,780 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరింది. నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 175.1050 టీఎంసీలు ఉన్నాయి. కుడి, ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 67,019 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.
అయిజ, జూలై 5 : తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. డ్యాం 19 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేరకు ఎత్తి దిగువకు 58,869 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం టీబీ డ్యాం ఇన్‌ఫ్లో 93,216 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 61,470 క్యూసెక్కులుగా ఉన్నది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 77.031 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 74,470, ప్రధాన కాల్వకు 595 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేసుల బరాజ్‌కు 73,875 క్యూసెక్కులు చేరుతున్నాయి.
రాజోళి, జూలై 5 : రాజోళి మండలం తెలంగాణ సరిహద్దులో ఉన్న సుంకేసుల నిండుకుండలా మారింది. శనివారం తెల్లవారుజామున గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో పర్యాటకులు సందడి చేశారు. శ్రీశైలానికి 74,423 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ మహేందర్‌రెడ్డి తెలిపారు.