అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లోకి
దేవరకద్ర నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.
- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
- కాంగ్రెస్, బీజేపీ నుంచి 100మంది చేరిక
భూత్పూర్, జనవరి 23 : దేవరకద్ర నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. దేవరకద్రకు చెందిన మాజీ ఎంపీటీసీ ఉస్కిల్ల వెంకట్రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు 100మంది సోమవారం భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో ఎమ్మెల్యే ఆల సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సా దరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. అనంతరం అన్నాసాగర్‌కు చెందిన సత్యయ్యగౌడ్కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.4లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే ఆల అందజేశారు. పార్టీలో చేరిన వారిలో మా జీ వార్డు సభ్యులు బాల్‌రాజు, రాములు తదితరులు ఉన్నా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు కొండా శ్రీనివాస్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాలరాజు, నాయకులు మున్నూర్, బాలరాజు, సత్యంసాగర్, రాము, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి మనెమోని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అనాథ బాలికలకు చేయూత
మూసాపేట, జనవరి 23 : మండలంలోని సంకలమద్ది బంగ్లగడ్డకు చెందిన ఇద్దరు అనాథ బాలికలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అండగా నిలిచారు. బంగ్లగడ్డకు చెందిన భవాని, పావని తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే.. వారిని ఆప్యాయంగా పలుకరించి ధైర్యం చెప్పారు. ప్రతినెలా రూ.2వేల నగదుతోపాటు బియ్యం అందజేస్తామని తెలిపారు. అనాథ బాలికలకు అం డగా నిలిచిన ఎమ్మెల్యేకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
అడ్డాకుల మండలం తిమ్మాపూర్‌కు చెందిన మాసయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అలాగే నర్సింహులు, వెంకటేశ్, మహేందర్ గాయపడ్డారు. బాధిత కు టుంబాలను ఎమ్మెల్యే ఆల పరామర్శించి రూ.25వేల ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా గుడిబండకు చెందిన దేవన్న తండ్రి మృతి చెందగా, కుటుంబసభ్యులను జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి పరామర్శించి రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

