Korean Kanakaraju | ‘కొరియన్ కనకరాజు’ సెన్సార్ టాక్.. వరుణ్ తేజ్ డ్యూయల్ షేడ్ పాత్ర హైలైట్ అంటూ ఇన్సైడ్ రిపోర్ట్
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు' విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా చూసిన వారి ఒపీనియన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా కామెడీ, వరుణ్ తేజ్ నటన, థమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయని టాక్ వినిపిస్తోంది.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి విజయవంతమైన కామెడీ చిత్రాలను తెరకెక్కించిన మేర్లపాక గాంధీ, మరోసారి తన మార్క్ కామెడీని ఈ చిత్రంలో చూపించినట్లు సమాచారం. సినిమా తొలి భాగం నుంచి రెండో భాగం వరకు పలు కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని సెన్సార్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు, తర్వాత వచ్చే ఎపిసోడ్లు బాగా వర్కవుట్ అయ్యాయని అంటున్నారు.అలాగే వరుణ్ తేజ్, సత్య మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌తో పాటు బుల్లిరాజు పాత్ర చుట్టూ తిరిగే సన్నివేశాలు కూడా మంచి వినోదాన్ని అందిస్తాయని సమాచారం.
సినిమాలో వరుణ్ తేజ్ రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన సాధారణ యువకుడు కనకరాజు పాత్రలో ఒకవైపు కనిపిస్తే, మరోవైపు కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ఆవహించిన తర్వాత పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వంతో కనిపించనున్నారని టాక్.ఈ రెండు పాత్రల మధ్య బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్టైల్ పరంగా వరుణ్ తేజ్ మంచి వేరియేషన్ చూపించారని సినిమా చూసిన వారు చెబుతున్నారు. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే వరుణ్ తేజ్ ఈసారి కమర్షియల్ ఎంటర్టైనర్లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారని సమాచారం.
సినిమా కథ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కియా కంపెనీలో ఉద్యోగం కోసం కొరియా నుంచి వచ్చిన యువతి పాత్రలో రితికా నాయక్ కనిపించనుంది. ఆమెను ప్రేమించే కనకరాజు జీవితంలో అనుకోని మలుపు తిరుగుతుంది.కొరియా నుంచి వచ్చిన ఓ బాటిల్లో బంధించబడిన గ్యాంగ్‌స్టర్ ఆత్మ బయటకు వచ్చి కనకరాజును ఆవహిస్తుంది. ఆ తర్వాత కనకరాజు జీవితం ఎలా మారింది? ఆ ఆత్మ కొరియాతో ఉన్న సంబంధం ఏమిటి? చివరకు కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనే అంశాల చుట్టూనే సినిమా సాగుతుందని తెలుస్తోంది. సినిమాకు సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు కథకు మరింత బలం చేకూర్చాయని సమాచారం. కామెడీ తర్వాత ఎక్కువ ప్రశంసలు సంగీతానికే వస్తాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

