తెలకపల్లి, డిసెంబర్ 24 : మండలంలోని గడ్డంపల్లికి చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌లో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాల్‌రాజు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీపురం అఖిల్‌రెడ్డి, వార్డు సభ్యులు బక్కయ్య, రమేశ్, విజయ్, మాజీ వార్డు సభ్యులు కుర్మయ్యతోపాటు 150 మంది గులాబీ గూటికి చేరిన వారిలో ఉన్నారు. అలాగే తెలకపల్లికి చెందిన 60 మంది బీఆర్ఎస్లో చేరారు.
వీరికి కండువాలు కప్పి పార్టీలోకి వారు సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వం పనితీరు బాగుందని, అందుకే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మధు, మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు మాధవరెడ్డి, ఎంపీటీసీ రమేశ్, ఉప సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు.