గద్వాల, మే16 : రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా ఉంటామని గద్వాల పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్ అన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ని రసిస్తూ గురువారం బీఆర్ఎస్ నాయకులు తాసీల్దార్ కా ర్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి వినతిప త్రం అందజేశారు.
ఈ సందర్భంగా సుభాన్ మాట్లాడు తూ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులు పండించిన ధాన్యానికి క్వింటాపై రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాటమార్చడం ఎంత వరకు సమంజసమన్నారు.
నియోజకవర్గం లో చాలా మంది దొడ్డు రకం ధాన్యం పండిస్తారని, ఈ వి షయం తెలిసి కూడా సన్నరకం ధాన్యానికే బోనస్ ఎలా ఇస్తారన్నారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేశ్‌నాయుడు, రాధాకృష్ణారెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, చిన్నయ్య, సత్యం, జగదీశ్‌రెడ్డి, వాసుదేవుడు, బాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, రఘు, లక్ష్మీకాంత్‌రెడ్డి, రంజిత్‌కుమార్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.