నారాయణపేట రూరల్, మార్చి 7: వేసవికాలంలో ప్రజల దాహం తీర్చడం మహాభాగ్యమని నారాయణపేట రూరల్ ఎస్ఐ రాముడు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నారాయణ పేట మండలం అప్పక్ పల్లి గ్రామ స్టేజీ వద్ద రేపల్లి ఎల్లమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎస్ఐలు రాముడు, గాయత్రి ప్రారంభించారు. వేసవికాలంలో ప్రజలు దాహంతో అలమటిస్తుంటారని అలాంటి వారి దాహం తీర్చడం మహాభాగ్యం అని రాముడు అన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల రేపల్లి ఎల్లమ్మ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎల్లమ్మ కుటుంబ సభ్యులు వడ్డే ఆశన్న, సిద్దు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.