e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021

మొక్కలు నాటి రక్షించాలి

కొనసాగుతున్న హరితహారం
పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో
మొక్కలు నాటిన సిబ్బంది
లక్ష్యం పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశం

మహబూబాబాద్‌రూరల్‌, జూలై 19 : మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం పెంపొందుతుందని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో హరితహారంలో భాగంగా సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో లక్ష మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. బక్రీద్‌, బోనాల పండుగలకు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులు వ్యాక్సిన్‌ వేసుకునేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ జనార్దన్‌ రెడ్డి, వై. రమేశ్‌, ఆర్‌ఐలు నరసయ్య, సురేశ్‌, లాల్‌బాబు, టౌన్‌ సీఐ రవికుమార్‌ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
కేసముద్రం: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్‌ గంట సంజీవరెడ్డి, గూడూరు ఎక్సైజ్‌ సీఐ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మండలంలోని కల్వల, ఉప్పరపల్లి గ్రామాల్లో వారు ఈత, తాటి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురవడానికి మొక్కలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గంట అశోక్‌రెడ్డి, గౌడ సంఘం నాయకులు ఓరుగంటి వెంకన్న, మోడెం వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల ఎల్లగౌడ్‌, కృష్ణమూర్తి, వల్లాల యాకన్న, మల్లేశం పాల్గొన్నారు.
బాలాజీ ఆలయంలో..
మరిపెడ: ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కౌన్సిలర్‌ ఎడెల్లి పరశురాములు అన్నారు. స్థానిక బాలాజీ ఆలయంలో ఆయన మొక్కలు నాటారు. ఆయన వెంట అర్చకుడు సముద్ర లక్ష్మీనరసింహచార్యులు ఉన్నారు.
పెద్దవంగరలో ఎస్సై రియాజ్‌పాషా
పెద్దవంగర: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని రక్షించాలని ఎస్సై షేక్‌ రియాజ్‌పాషా అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు వడ్డ్డేకొత్తపల్లి, మోత్యా తండా జీపీ పరిధిలోని వలిగొండ – తొర్రూరు ప్రధాన రహదారికి ఇరువైపులా సిబ్బందితో కలిసి 500 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి గ్రామాలను హరితవనాలు మార్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొబెషనరీ ఎస్సై శివకుమార్‌, సిబ్బంది శ్రీనివాసరావు, సుధాకర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, టీఏ సురేశ్‌నాయక్‌ పాల్గొన్నారు.
భవితరాల బంగారు భవిష్యత్‌ కోసం..
నర్సింహులపేట: భవితరాలకు బంగారు భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ పిలుపునిచ్చారు. మండలంలోని పడమటిగూడెం గ్రామ శివారు జాతీయ రహదారి సమీపంలో పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మొక్కలు నాటి వాటిని దత్తత తీసుకోవాలన్నారు. ఎక్కడ చెట్లు ఉంటే అక్కడే వర్షాలు కురుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ టేకుల సుశీల, తొర్రూరు సీఐ కర్ణాకర్‌రావు, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఎస్సై నరేశ్‌, సర్పంచ్‌ జొన్నగడ్డ యాదలక్ష్మి, ఉపసర్పంచ్‌ నర్సమ్మ, ఏపీవో మాధవి, ఎంపీటీసీ పాతూరి మధు, ఎంపీవో సోంలాల్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌, వెంకన్న, పోలీసు సిబ్బంది యాకన్న, నాయకులు లింగ య్య, శ్రీశైలం, ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
తాటి, ఈత వనాలు పెంచాలి
చిన్నగూడూరు : గ్రామాల్లో తాటి, ఈత వనాలు పెంచాలని ఎక్సైజ్‌ ఎస్సైలు హరీశ్‌, జహీర్‌ పిలుపునిచ్చారు. మండ ల కేంద్రంలోని ముత్యాలమ్మచెరువుకట్టతో పాటు, ఉగ్గంపల్లి గ్రామాల్లో సోమవారం తాటి, ఈత విత్తనాలు నాటా రు. గీత కార్మిక సంఘం నాయకులు నర్సయ్య, వెంకన్న, మల్లయ్య, వెంకటయ్య, యాదగిరి, వెంకన్న, లాలయ్య, కొమిరెల్లి, శ్రీను, సత్యనారాయణ, ఎక్సైజ్‌ సిబ్బంది ప్రభాకర్‌, శ్రీనివాస్‌, మజార్‌ఖాన్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
మొక్కలతోనే మానవ మనుగడ
మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ఎంపీపీ పద్మవెంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో స్థానిక అధికారులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో సరస్వతి, నాయకులు వెంకట్‌రెడ్డి, చెన్నారెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ జ్ఞానేశ్వర్‌, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement