తొలిదశోద్యమంబు వెలిసిబోయినమీద
పురుడు పోసుకొనెను పోరుబాట
మరల దేశమందు మనయునికిని చాట
ముప్పదేండ్ల కృషికి మూలమనగ
పదియునాలుగేళ్ళు ప్రజల మనసులందు
చెరిగి పోని ముద్ర చేరవేసి
తెచ్చుకొంటిమయ్య తెలగాన మన భూమి
పాట మాట పనుల పదును బెట్టి
పదివర్షంబుల పాలన
మది దోచునటుల జరిగెను మనకభి వృద్ధిన్
పదిలముగాజేసి నిలిపె
కుదురుగ జనులందరికిని కూర్చెను శుభముల్
నిధులు కొలువులింక నీళ్ళకొరకనుచు
జరిగినట్టి పోరు వరములిడగ
మనదు భాగ్యమంత మనవైపు తిరుగగ
గంతులేసినాము సంతసమున
లోపమేమొకాని శాపమయ్యెను మనకు
మార్పు పాలనందు మంచి లేక
మరల మనల మనమె పరిపాలనము జేయు
దారి చూసినపుడె ధన్యతగును
– చిలకమర్రి కృష్ణమాచార్యులు 99855 13883