పునరుజ్జీవన పోరుబాట
తెరిచిన తలవంపులు తలుపులు
వెలుగు లీను తెలంగాణం
వ్యథలపాలై శోకించిన వైనం
ఒడవని కారుచీకట్ల ఇక్కట్లు
ఎక్కిన మెట్లెన్నోచరిత్రలో నిక్షిప్తం
విస్ఫోటనంలా రగిలించిన ఉద్యమ స్ఫూర్తి
అనతికాలంలో సాధించిన
నవనవోన్మేష ప్రగతి ప్రభంజనం
సాక్షాత్కరించిన రాష్ట్ర
అభ్యుదయ అవతరణం
కబోదుల పాలై మసక చీకట్లో విలవిల
అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణ తెలంగాణ
రైతన్నల ఆత్మాహుతికి బలైన
దీనావన భిక్షాటనలో
తలవంపుల పరిపాలన
కపట కుతంత్రాల్లో బలైన జనజీవనం
అధికార పీఠమెక్కించే రాజకీయం.
ప్రగతి రథ చక్రాల కాలరాచే మంత్రాంగం
ప్రగతి దారుల్లో మొలిచిన ముళ్ళపొదలు
చెదలు తొలిచిన పత్రహరిత మాగాణం
కత్తుల జిత్తుల కపట
పద్మవ్యూహాలు
వ్యవస్థలన్నీ అవస్థల పాలైన
కల్లోల రాజకీయ దవానలం
విద్వేష విషాలమయమైన కురుక్షేత్రం
నా తెలంగాణ..
పథనిర్దేశ మార్గదర్శకమయ్యే
ధర్మక్షేత్రం
– కె.లక్ష్మణ్ గౌడ్ 97049 30509