తెలుగు సాహిత్య మహాసభ – 2024
తెలంగాణ సామాజిక, రాజకీయార్థిక చలనాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. 1919వ సంవత్సరంలో ఏర్పాటైన తెలుగు శాఖ బోధన, పరిశోధన రంగాల్లో ప్రమాణాలను నెలకొల్పుతూ వందేండ్లను పూర్తి చేసుకుంది.
తెలంగాణ సామాజిక, రాజకీయార్థిక చలనాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం. 1919వ సంవత్సరంలో ఏర్పాటైన తెలుగు శాఖ బోధన, పరిశోధన రంగాల్లో ప్రమాణాలను నెలకొల్పుతూ వందేండ్లను పూర్తి చేసుకుంది. సాధికారికమైన పరిశోధన విలువలను తెలుగు సమాజానికి అందించిన తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వేదికగా 2024 ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో ‘తెలుగు సాహిత్య మహాసభ 2024’ జరుగనున్నది. ఓయూ తెలుగు శాఖాధ్యక్షులు ప్రొఫెసర్ సి.కాశీం ఈ సభకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా తెలుగు భాష, సాహిత్య, పరిశోధన రంగాల్లో కృషి చేస్తున్న ప్రముఖ కవులు, రచయితలు, పరిశోధకులు పాల్గొంటారు. అలాగే వివిధ భాష, సాహిత్య విషయాల్లో నిష్ణాతులైన 100 మంది విషయ నిపుణులు పత్ర సమర్పణ చేస్తారు. సాహిత్య శిల్పం, సాహిత్య మూల్యాంకనం అనే అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు ఉంటాయి. సాహిత్యాన్ని సాధారణ ప్రజలు, విద్యార్థుల వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 15, 16 తేదీల్లో సాహిత్య, కళాభిమానుల కోసం ‘కవితా పొద్దు, కవితా వసంతం’ అనే కవిగాయక సభలను నిర్వహిస్తున్నారు. కళాభిమానులు పాల్గొని కవిగాయక సభలను విజయవంతం చేయాల్సిందిగా కన్వీనర్ ప్రొఫెసర్ సి.కాశీం కోరారు.
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

