ఆ బక్క పలుచ మనిషి
తెలంగాణ మట్టిని గుండెకు హత్తుకున్నడు
నీళ్ల దోపిడి, నియామకాల దోపిడి, నిధుల
దోపిడిలతో తెలంగాణ తల్లిని చెరబడితే
తెలంగాణ బిడ్డల దుఃఖము ఉప్పెనై పొంగి
కన్నీళ్ళై పారి, ఆకలి కేకలై రోదిస్తుంటే అన్నింటి తన నర నరాలలో పారుతున్న ఎర్రటి రక్తంలో కలుపుకొని సలసల మరిగిండు
జై తెలంగాణ నినాదమై జన సంద్రము గుండెల్లో పొలికేక పెట్టిండు
ఊసిళ్ల పుట్ట అయి ఉద్యమం
తాగిండు చిన్న పెద్ద ముసలి
ముతక అడుగులై కదిలిండు
వలసవాద దోపిడికి
అడ్డుకైట్టె నిలిచిండు
తెలంగాణ జెండా
అయి జూన్ 2న రెపరెపలాడిండు
తెలంగాణ ప్రజల ఆశలనవ్వై మెరిసిండు
అభివృద్ధి రథసారథిగా కదిలిండు
తెలంగాణను సస్యశ్యామలం చేసిండు
తెలంగాణ అయి వెలిగిండు
తను ఒక జీవ జలం
జనుల అంతరంగ గళం
– గుండెల్లి ఇస్తారి 98499 83874