వరం కాకున్నా స్వయం పాకం
జీవితానికి అత్యవసరంగా నైపుణ్యం
హస్త లాఘవం మరి!
మొదటిసారి స్వయం పాకంలో
అన్నం అంబలి కావచ్చు!
రెండోసారి అన్నం నలువ నలువగా
పంటి కింద నూక నూక కావచ్చు
అగ్ని దేవుడి బాధ్యత ఏమీ లేదు
అంతా నీ లోపాయికారి
అభ్యాస యోగ యుక్తేన!
తర్వాత తర్వాత నీ స్వయంపాకం
నలభీమ పాకం!
మీ అమ్మ మీ ఆవిడ పిల్లలు
నీ స్వయం పాకానికి సర్టిఫికెట్ ఇస్తారు
మీ ఇలవేల్పు నీ స్వయం పాకాన్ని
ఆరగించడానికి కొండ దిగివస్తాడు
హోటల్ అన్నం మంటగా
సున్నం తేట గ్యాస్ గ్యాస్
మన చేతి వంట నానా రుచిరార్థం!
దేహానికి వృద్ధిగా సమృద్ధిగా
స్వయం పాకం స్వయంభువు
– కందాళై రాఘవచార్య 8790593638